తెలుగుదేశం నేత పట్టాభి(tdp leader pattabhi) వ్యాఖ్యలను నిరసిస్తూ... జనాగ్రహం(janagraham) పేరుతో వైకాపా శ్రేణులు(YCP leaders) దీక్షలు చేపట్టారు. విజయనగరం జిల్లా కురుపాంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయించిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
36 గంటల దీక్ష హాస్యాస్పదం...
కృష్ణా జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు(MLA mondithoka jaganmohan rao) జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. గుంటూరు గాంధీపార్క్ కూడలిలో తలపెట్టిన జనాగ్రహ దీక్షలో గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. సీఎంను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తెదేపా నేతలను నియంత్రించాల్సిన చందబ్రాబు(chandrababu).. 36 గంటల దీక్ష చేయడం హస్యాస్పదంగా ఉందని నేతలు విమర్శించారు.
రాయలసీమలో ఖూనీలు జరిగేవి...
ఒంగోలు కలెక్టరేట్(ongole collectorate) ఎదుట నిరసనలు చేపట్టిన వైకాపా నాయకులు.. చంద్రబాబు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని అంబేడ్కర్ కూడలి(kadapa ambedkar circle) వద్ద వైకాపా శ్రేణులు రెండు రోజుల దీక్షలు చేపట్టారు. కడప జిల్లా మైదుకూరులో దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంపై రాళ్లు వేశారని, అదే రాయలసీమలో అయితే ఖూనీలు(murders) జరిగేవని హెచ్చరించారు. వైకాపా చేపట్టిన 48గంటల దీక్షలో భాగంగా మైదుకూరులో చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
సస్పెండ్ చేయాలి...
వైఎస్ జగన్(CM Jagan)ను నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్‌కు(state bandh) పిలుపునిచ్చి అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని వైకాపా నేతలు ఆరోపించారు. అసభ్యంగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్(suspend) చేసి క్షమాపణ చెబితే గౌరవం ఉంటుందన్నారు. శాంత్రిభద్రల సమస్యలను సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో ఎన్నో హత్యలు జరిగినా రాష్ట్రపతి పాలన(president ruling) విధించలేదని, ఇప్పుడు ఎన్ని ఖూనీలు జరిగాయని రాష్ట్రపతి పాలన అడుగుతున్నారని వైకాపా నేతలు ప్రశ్నించారు.
ఇవీచదవండి.