విజయవాడలో శాసనసభ్యుడు గద్దెరామ్మోహన్ రావు ధర్నా చేశారు. తెదేపా ఓట్లను తొలగింపునకు వైకాపానే కారణమని ఆరోపించారు. ఫారం 7 ఆధారంగా తెదేపా కార్యకర్తలు, సానుభూతి పరులు ఓట్లను తొలగించిన వారిని కనిపెట్టి కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు విజ్ఞప్తి చేశారు. తెదేపా విజయావకాశాలు దెబ్బతీసే రీతిలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే సుమారు 4 వేల 5వందల ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును తొలగించడం క్షమించరాని నేరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయం వరకూ ప్రతిఒక్కరూ తమ ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని ఓటర్లను కోరారు.