ఉద్యోగాల భర్తీ విషయంలో మోసం చేసినందుకు.. నిరుద్యోగ యువత, విద్యార్థులు జగన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని.. తెదేపా నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. సీఎం జగన్ అసత్యాలతో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉద్యోగాల్లేక తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. గోబెల్స్ ప్రచారం తరహాలోనే జగన్ విధానాలున్నాయని యనమల మండిపడ్డారు. తన సొంత మీడియా గోబెల్స్ ప్రచార సాధనంగా వ్యవహరిస్తోందన్నారు. హిట్లర్‌కు పట్టిన గతే.. వైకాపాకు పట్టనుందని విమర్శించారు.
జగన్ రెడ్డి వ్యాఖ్యలు స్వలాభం కోసమే
భాజపాకు కేంద్రంలో పూర్తిమెజారిటీ లేకుంటేనే ప్రత్యేక హోదా అడగగలం అని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. స్వలాభం కోసమేనని ధ్వజమెత్తారు. గట్టిగా పోరాడితే సాధ్యమయ్యే ప్రత్యేక హోదా అంశాన్ని.. కేసుల మాఫీ కోసం తాకట్టు పెడుతున్నారని యనమల ఆరోపించారు. శాసనసభలో జగన్ రెడ్డి చేసిన మండలి రద్దు తీర్మానం.. తెదేపాపై కక్షతో తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. ప్రజా అభీష్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు రద్దు నిర్ణయం తీసుకున్నారు తప్ప.. ప్రజా ప్రయోజనాల కోసం కాదన్నది సుస్పష్టమని యనమల అన్నారు.
ఇదీ చదవండి:
MP Raghurama letter to CM : జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ