రాష్ట్రానికి కరోనా కంటే నాలుగైదు రెట్ల నష్టం జగోనా వల్ల జరిగిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఏడాది కాలంలో జరిగిన ఆర్ధికాభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్దిరేటు, తలసరి ఆదాయం, అప్పుల వివరాలను ప్రజలకు వెల్లడించాలన్నారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అబద్దాలతో చేసిన అప్పులను కప్పిపుచ్చలేరని వ్యాఖ్యానించారు. గత ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు ఏ పద్దు కింద ఏయే రంగాలకు ఎంతెంత నిధులు వెచ్చించారు, రెవిన్యూలోటు, ద్రవ్యలోటు తదితర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: యనమల - రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: యనమల
వైకాపా ఏడాది కాలంలో జరిగిన ఆర్ధికాభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు ఏ పద్దు కింద ఏయే రంగాలకు ఎంతెంత నిధులు వెచ్చించారు, రెవిన్యూ లోటు, ద్రవ్యలోటు తదితర వివరాలు వెల్లడించాలన్నారు.
ఏ రంగానికి ఎంతెంత బడ్జెట్, ఖర్చు, కోత, ఎకనామిక్ గ్రోత్, తలసరి ఆదాయం ఎంత..? తలసరి ఆదాయంలో వృద్ధి ఎంత..? అన్ని వివరాలు శ్వేతపత్రంలో చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. వీటన్నింటిని దాస్తుదంటే ప్రభుత్వం తప్పులు చేసినట్లేనని పేర్కొన్నారు. జగన్ తన వైఫల్యాలను కరోనాపై, లాక్డౌన్లపై నెట్టి తప్పించుకోలేరన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో కరోనా ప్రభావం 9 రోజులేనని గుర్తు చేశారు. అనుభవం తెదేపాది అయితే, అబద్దాలు వైకాపావని ప్రజలకు ఇప్పటికే అర్ధం అయ్యిందన్నారు. వైకాపా తన అబద్దాలతో తమ అనుభవాన్ని హేళన చేయాలని అనుకుంటే అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.