బిహార్‌కు చెందిన దినేష్‌కుమార్ సింగ్ (45) 14 ఏళ్ల కిందట విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. ఎనికేపాడులోని ఒక పాదరక్షల తయారీ సంస్థలో పనిచేసేవాడు. అతనికి భార్య చింతాసింగ్, కుమారులు సత్యం శివం, లక్ష దీప్ ఉన్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. పిల్లల మైనార్టీ తీరే వరకు తల్లి వద్దే ఉంచాలని కోర్టు సూచించింది.
దినేష్‌కుమార్ సింగ్‌కు ఒక సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటిలో పైఅంతస్తులో చింతాసింగ్, పిల్లలు, కింద అంతస్తులో దినేష్‌కుమార్ ఉండాలని కోర్టు పేర్కొంది. రెండేళ్లుగా ఆ ఇంటిలో ఉంటున్నారు. చింతాసింగ్ రామవరప్పాడులోని అయ్యంగార్ బేకరిలో పనిచేస్తోంది. దినేష్ తన ఇంటి కింద అంతస్తులోనే చెప్పుల కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకొని, ఒక గదిలో నివాసం ఉంటున్నాడు. పిల్లల పోషణ ఆమె చూసుకుంటోంది. ఫీజులు మాత్రం దినేష్ చెల్లిస్తున్నాడు.
ఈ నెల 17న రాత్రి దినేష్ తన గదిలో నిద్రపోయాడు. 18వ తేదీ ఉదయం చింతాసింగ్ వేకువజామున పనికి వెళ్లేందుకు నిద్రలేచి, పిల్లలు లోపల నిద్రపోతుండగా బయట గడియపెట్టి వెళ్లిపోయింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో దినేష్‌కుమార్ వద్ద పనిచేస్తున్న యువకుడు వచ్చి చూడగా, అతను విగతజీవిగా పడి ఉండడం చూసి భయంతో పారిపోయాడు.