ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఫలితాల కోసం వెయిట్ చేయలేకపోతున్నారా..అయితే ఇలా చేయండి - http://covid19.ap.gov.in

కరోనా పరీక్షలు చేయించుకుని రోజులు గడుస్తున్నా.. మొబైల్ కు పరీక్షా ఫలితం సమాచారం రాలేదా.. అధికారులను ఎవరిని అడగినా సమాచారం ఇవ్వడం లేదా.. ఇకపై కరోనా టెస్టు ఫలితం కోసం ఏ ఆస్పత్రికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక లుక్ వేయండి మరీ..

krishna distrct
కరోనా ఫలితాలకోసం వెయిట్ చేయాలేకపోతున్నారా.. అయితే ఇది ట్రై చేయండి

By

Published : Jul 31, 2020, 4:52 PM IST

ఇకపై కరోనా ఫలితాల కోసం మొబైల్​కు వచ్చే సంక్షిప్త సమాచారం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. చిన్న క్లిక్​తో కరోనా పరీక్ష ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఆన్​లైన్​లో పరీక్షా ఫలితాలను అందుబాటులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. http://covid19.ap.gov.in వెబ్ సైట్​లో పరీక్షా ఫలితాలు లభ్యమవుతాయి. వెబ్​సైట్​లో పేషంట్ హిస్టరీ ఫర్ కొవిడ్-19 అనే బాక్స్ పై క్లిక్ చేయాలి. పరీక్ష చేయించుకున్న వారి ఆధార్ నెంబర్ లేదా పరీక్షా సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా టెస్ట్ శాంపిల్ ఐడీ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా పరీక్ష చేయించుకున్న వ్యక్తి పేరు, వయస్సు, లింగం, జిల్లా వివరాలు ఇవ్వాలి. సబ్మిట్ బటన్ నొక్కగానే ఇచ్చిన సెల్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయగానే వెంటనే కరోనా పరీక్ష ఫలితం వచ్చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details