స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత: నగర పోలీసు కమిషనర్
విజయవాడ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. నగరంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు.
సీపి ద్వారకా తిరుమలరావు
విజయవాడ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. నగరంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఈ కళాశాలలోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడంచెల భద్రతతో ఈవీఎంలను పోలీసులు పహారా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజు అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.