విజయవాడ నగరంలోని పటమటలో అవధూత గణపతి సచ్చిదానంద స్వామీ ఆశ్రమంలో... వినాయక చవితి వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యలో వినాయకచవితి వేడుకలు ప్రారంభించారు. గణేశ్ చతుర్ధి కోసం... స్వామీజీ విజయవాడ ఆశ్రమానికి వచ్చారు. స్వామీజీ రాకతో... భక్తుల తాకిడి, పూజాదికాలు, హోమాలతో ఆశ్రమంలో సందడి నెలకొంది.
సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో వినాయక చవితి వేడుకలు - సచ్చిదానంద స్వామీ
విజయవాడ నగరంలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో వినాయకచవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యలో వినాయకచవితి వేడుకలు ప్రారంభించారు.
సచ్చిదానంద స్వామీ ఆశ్రమంలో వినాయకచవితి వేడుకలు
నిర్వికారుడు, నిరామయుడైన గణపతి మనకు తొలి దేవుడని, ఆయనను ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు ఆరాధిస్తారని గణపతి సచ్చిదానంద స్వామీజీ చెప్పారు. అందరూ మట్టి వినాయకున్నే పూజించి... పర్యావరణాన్ని కాపాడాలని సందేశం ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయని, దేశం సుభిక్షంగా ఉండాలని... అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తొలగిపోయి అంతా శుభం జరగాలని భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ...రాజధాని ప్రజలందరిది.. ఓ వర్గానిది కాదు: మంత్రి బొత్స