ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైకాపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. విజయవాడకు చెందిన ఓ హోటల్ యజమానిని కమిషనర్ గా నియమించటం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న వ్యక్తి తెదేపా అనుచరులని తెలిపారు. ఆర్టీఐ చట్టం ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరారు. స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టే వారికి తగిన అర్హతలు ఉండాలన్నారు. లా, సైన్స్ ఆండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్ మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులనే ఎంపిక చేయాల్సి ఉందన్నారు .
పార్టీతో కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పదవుల్లో, వ్యాపారాల్లో ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. హోటల్ యజమానిని, ప్రైవేటు సెక్రటరీగా ఉండే వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. కొందరి పేర్లపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. రాజకీయ దురుద్దేశంతో నియామకాలను చేపట్టారని.. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు నియామకాలు చేపట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు.
ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైకాపా అభ్యంతరం - rti
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఆర్టీఐ కమిషనర్ల నియామకం అభ్యంతరం తెలిపారు.
విజయసాయిరెడ్డి
ఇది కూడా చదవండి.