ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మిడతల దండుకు... కంచే కాపు..!

నైరుతి రుతుపవనాల రాకతో తొలకరి జల్లుమంది. నేల చల్లబడింది. మట్టి వాసన గుబాళిస్తోంది. ఆకుపచ్చని అందం తొడిగేందుకు భూమి సిద్ధమైంది. విత్తు నాటేందుకు రైతన్న సన్నద్ధం అవుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నా రానున్న ఉపద్రవం అన్నదాతను కలవరపెడుతోంది. మిడతల దండు దండయాత్రపై రైతన్న ఆందోళన చెందుతున్నాడు. రైతన్న సమస్యను పరిష్కరించేందుకు విజయవాడకు చెందిన నలుగురు యువకులు ఓ ఆవిష్కరణ చేశారు. కరెంటు కంచెతో రక్కసి మిడతలను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

By

Published : Jun 14, 2020, 12:00 AM IST

Published : Jun 14, 2020, 12:00 AM IST

Updated : Jun 14, 2020, 3:38 PM IST

మిడతల దండుకు... కంచే కాపు..!
మిడతల దండుకు... కంచే కాపు

కరోనా మహమ్మారి వ్యాప్తి, రబీ చిక్కులతో అలసి సొలిసిన రైతన్నను నైరుతి చినుకులు చల్లబరిచాయి. చేయి పట్టి సేద్యానికి నడిపాయి. కానీ ఇంతలోనే మరో ఉపద్రవం అన్నదాతను ఆందోళన పెడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఆహార భద్రతకు సవాల్‌ విసురుతోన్న రాకాసి మిడతలు.. తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్న సంకేతాలు కర్షకులను కలవరపెడుతున్నాయి.

మిడతల దండు... కంచే మందు

మిడతల దండుకు... కంచే కాపు..!

మిడతల దండు దాడి చేస్తే నష్టం ఎక్కువగానే ఉంటుందని, లేత పంటను పీల్చిపారేస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మిడతల దండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు సంబంధిత అధికారులను ఆదేశించాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు విజయవాడకు చెందిన నలుగురు యువకులు ఓ ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. దోమల నివారణకు వినియోగించే బ్యాట్‌ తరహాలో కంచెను రూపొందించారు. ఈ కంచెను పొలం వద్ద అమరిస్తే ప్రయోజనం ఉంటుందని- తక్కువ ఖర్చుతో... పంటలను మిడతలు, ఇతర పురుగుల నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

ఇదీ చదవండి :నన్ను సంప్రదించారు... చట్ట ప్రకారమే అరెస్టు: సభాపతి తమ్మినేని

Last Updated : Jun 14, 2020, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details