ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ టు కేరళ - NEW FLIGHT

మార్చి మెుదటి వారంలో తిరుపతి నుంచి కొచ్చి సర్వీసును స్పైస్ జెట్ విమానసంస్థ ప్రారంభించనుంది.

త్వరలో విజయవాడ నుంచి కేరళకు కొత్త విమానం

By

Published : Feb 16, 2019, 11:28 AM IST

Updated : Feb 16, 2019, 11:45 AM IST

విజయవాడ విమానాశ్రయం నుంచి కేరళలోని కొచ్చి నగరానికి విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మార్చి 1 నుంచి తిరుపతి మీదుగా కొచ్చి సర్వీసును స్పైస్ జెట్ విమాన సంస్థ ప్రారంభిస్తోంది. ఇప్పటికే టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 4 వేల నుంచి 6 వేల వరకు టికెట్ ధర ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఏటా ప్రయాణికులు పెద్దయెత్తున కేరళకు విహార యాత్రకు వెళ్తుంటారు. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి అక్కడి నుంచి కేరళకు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి రైలులో కొచ్చికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. విమాన సర్వీసు అందుబాటులోకి వస్తే కేవలం మూడు గంటల్లోనే కొచ్చికి వెళ్లవచ్చు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ, తిరుపతి, కడప, హైదరాబాద్, దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. మార్చి 1 నుంచి కొచ్చికి నడిపితే తొమ్మిది నగరాలకు సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లవుతోంది.

త్వరలో విజయవాడ నుంచి కేరళకు కొత్త విమానం
Last Updated : Feb 16, 2019, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details