ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యం ఎప్పటికి అందేనో! - ఆసుపత్రి

పేదల కోసం అత్యాధునిక వసతులతో విజయవాడలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం నత్త నడకన సాగుతోంది. రెండేళ్లవుతున్నాపూర్తికాలేదు. అధికారులు మాత్రం మరో రెండునెలల్లో ప్రారంభోత్సవం చేస్తామంటున్నారు. త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు .

విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం

By

Published : Feb 16, 2019, 6:06 AM IST

Updated : Feb 16, 2019, 10:21 AM IST

విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
ఏడాదిగా విజయవాడ ప్రభుత్వాసుప్రతికి రోగుల తాకిడి పెరిగింది. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా వైద్యం లభిస్తుందని.. చుట్టుపక్కల జిల్లాల నుంచి వైద్యం కోసం అక్కడకు వస్తున్నారు. దీనికి అనుగుణంగా పేదల కోసం అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2016 జూన్ 2 నవనిర్మాణదీక్ష రోజు.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏడాదిలో పూర్తి చేయాలనే లక్ష్యం... రెండేళ్లవుతున్నా పూర్తికాలేదు. ఉన్న ఆసుపత్రికి రోగుల తాకిడితో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

రాజధాని నగరంగా మారిన తర్వాత అధికసంఖ్యలో రోగులు వస్తుండటంతో విజయవాడ ప్రభుత్వాసుప్రతి రోగులతో కిటకిటలాడుతోంది. సమయానికి చికిత్స అందుతున్నా... అత్యాధునిక వైద్యం మాత్రం... అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నూతన ఆసుపత్రి ప్రాంగణంలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టింది. 5 అంతస్తుల్లో విశాలంగా..ఆధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాలు పూర్తై ఏడాది అవుతున్నా...నేటికి పూర్తిస్థాయి పనులు పూర్తి కాలేదు.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తే... మరో 6నెలల సమయం పట్టేలా ఉందని రోగులు వాపోతున్నారు. గదులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. లిఫ్ట్ పనులు, అగ్నిమాపక నిరోధక వ్యవస్థ ఏర్పాటు నత్తనడకన సాగుతున్నాయని అంటున్నారు. అధునాతన యంత్ర పరికరాలు, ఇంటీరియర్ జరగాల్సి ఉందని రోగులు చెబుతుండగా... ఆసుపత్రి సిబ్బంది మాత్రం మరో రెండు నెలల్లో ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందంటున్నారు.

ఆసుపత్రికి అవసరమైన మంచాలు, స్ట్రెచర్లు, కుర్చీలు, టేబుళ్లు, బల్లలు కొనుగోలు చేశారు. రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా కార్పొరేట్ ఆసుపత్రి స్థాయి మంచాలు తీసుకొచ్చారు. వీటిని రెండో అంతస్తులో ఓ మూలకు పడేశారు. దుమ్మూ- ధూళితో ఇవన్నీ తుప్పుపట్టిపోతున్నాయి.

అధికారుల పర్యవేక్షణ లేకే నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని....మరో ఆరునెలలయినా ఆస్పత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని రోగులు వాపోతున్నారు.

Last Updated : Feb 16, 2019, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details