ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్ఫ్యూ వేళ..రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు

కర్ఫ్యూ వేళల్లో రోడ్లపైకి వచ్చే వాహనదారులపై పోలీసులు జరిమానాలు, కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసర సేవల పేరుతో నగరంలో అధికసార్లు తిరుగుతున్న వారిని అరికట్టేందుకు కార్యాచరణ చేపట్టారు.

vijayawada police
కర్ఫ్యూ వేళలో రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు

By

Published : May 23, 2021, 5:46 PM IST

విజయవాడ నగరంలో కర్ఫ్యూ నిబంధనలను విరుద్ధంగా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలా రోడ్లపైకి వస్తున్న వారిపై జరిమానాలు, కేసులు నమోదు చేస్తున్నారు.

మెడికల్, అత్యవసర సర్వీసు పత్రాలు కలిగిన సిబ్బంది నగరంలో అనేకసార్లు వివిధ ప్రాంతాల్లో వాహనాలపై తిరగడాన్ని నిరోధించేందుకు.. వారి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లమీద తిరిగితే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details