ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వలస కూలీలకు ఆసరాగా పోలీసులు - విజయవాడ పోలీసులు తాజా వార్తలు

రహదారులపై ఇబ్బందులు పడుతూ సొంత గూటికి చేరాలని బయలుదేరిన వలస కూలీలకు గన్నవరంలో పోలీసులు సాయం అందించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు. మాస్కులు, శానిటైజర్లు, పాదరక్షలు పంపిణీ చేశారు.

vijayawada police helping immigrants in gannavaram
చలివేంద్రం ఏర్పాటు చేసిన పోలీసులు

By

Published : May 18, 2020, 2:12 PM IST

వలస కూలీల కోసం గన్నవరంలో విజయవాడ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో డీసీపీ హర్షవర్ధన్ రాజు, ఐజీ కె.సత్యనారాయణ, ఈస్ట్ జోన్ ఇంచార్జ్ ఏసీపీ రమేష్, విమానాశ్రయం ఏసీపీ వెంకటరత్నం చలివేంద్రం ప్రారంభించారు.

అనంతరం స్థానిక సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ మహేంద్ర చేతుల మీదుగా సుమారు వెయ్యి మంది కూలీలకు పండ్లు, బ్రెడ్, శీతల పానీయాలు, పాదరక్షలు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details