బెజవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం దాతల నుంచి మరింత సహాయం పొందేందుకు ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. ఛైర్మన్ సోమినాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో... మొత్తం 38 అంశాలపై చర్చించారు. సంప్రదాయ బద్ధంగా ఆలయానికి వచ్చే భక్తులు... రాజగోపుర మార్గం నుంచి లోపలికి ప్రవేశించి... దర్శనం చేసుకునేలా క్యూ లైన్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. సుమారు రూ.23 కోట్ల వ్యయంతో దుర్గాఘాట్‌లో శాశ్వత కేశఖండనశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి - విజయవాడ దుర్గగుడి పాలకమండలి నిర్ణయాలు
విజయవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి సారించింది. దాతల నుంచి సహాయం పొందేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దర్శనం క్యూలైన్లలో మార్పులు, శాశ్వత కేశ ఖండనశాల ఏర్పాటుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు.
దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి