స్వచ్ఛ సర్వేక్షణ్‌లో(Vijayawada Swachh Survekshan Rank) విజయవాడ నగరపాలక సంస్థ మూడో ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 4,500 నగరాల్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించింది. ఇందులో విజయవాడ నగరపాలక సంస్థకు మూడో స్థానం దక్కింది.
Vijayawada Swachh Survekshan Rank : చెత్తరహిత నగరాల్లో.. విజయవాడకు మెరుగైన ర్యాంక్
విజయవాడ నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో (Swachh Survekshan) మూడో ర్యాంక్ లభించింది. దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అందుకున్నారు.
చెత్తరహిత నగరంలో విజయవాడ ర్యాంక్
ఈ అవార్డును దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా.. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అందుకున్నారు. నగరపాలక సంస్థ అందిస్తున్న సేవల్లో మూడు విభాగాలను పరిశీలించి.. ఈ ర్యాంకును అందజేసినట్లు అధికారులు తెలిపారు. 2021 ఏడాదికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడో ర్యాంకు రావటం సంతోషకరమని నగరపాలక సంస్థ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలు