స్వచ్ఛతలో విజయవాడ @ 12
స్వచ్ఛ సర్వేక్షణ్-2019 పేరిట కేంద్రప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో విజయవాడ నగరపాలక సంస్థ 12వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు దక్కింది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ - 2019 ర్యాంకుల్లో విజయవాడ నగర పాలక సంస్థ 12వ ర్యాంకు.. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకుసాధించింది. లక్ష జనాభా పైబడిన నగరాలలో వివిధ విభాగాల్లోపోటీపడివిజయవాడ నగర పాలక సంస్థ...ఈ ర్యాంకు సాధించింది. న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్పురస్కారాల ప్రదానోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ ఎం. రామారావు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారం అందుకున్నారు.