ఏపీలో వస్త్ర పరిశ్రమ దుర్భర స్థితిలో ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. నష్టాల్లో కూరుకుపోయిన స్పిన్నింగ్ మిల్స్ మూతపడుతున్నాయన్నారు. వ్యవస్థాగత మార్పులు తీసుకురావాల్సి అవసరం ఉందని సూచించారు. ఎగుమతులు పెంచి,.. పెట్టబడి ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టి కేంద్రం వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఈ సమస్యతో ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోతున్నారని వాపోయారు.
'వస్త్ర పరిశ్రమలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలి' - vijaya sai reddy
ఏపీలో వస్త్ర పరిశ్రమ నష్టాల్లోకి కూరుకుపోకుండా కేంద్రం ఆదుకోవాలని రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు.
రాజ్యసభలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయి