Varla Ramayana Protest Initiation: అసెంబ్లీలో చంద్రబాబు భార్యపై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆ వ్యాఖ్యలకు నిరసనగా తెదేపా నేత వర్ల రామయ్య దీక్ష చేయనున్నారు. సీఎం క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో నేడు వర్ల రామయ్య దంపతులు.. 12 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నట్లు వర్ల రామయ్య(tdp leader varla ramaiah news) తెలిపారు.
పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం..
నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో తాను మాట్లాడుతుండగా.. స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు తెలిపారు. దాంతో అసెంబ్లీ నుంచి చంద్రబాబు, మిగతా తెదేపా ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.