రాజ్యసభ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లులను ఆమోదించారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. ఇప్పటికే ఉన్న చట్టాలను పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే..వ్యవసాయంతో పాటు వినియోగదారులు బాగా నష్టపోతారన్నారు. అందరితో చర్చించి కొత్త చట్టాలు తెచ్చామనడం సరికాదని హితవు పలికారు. కొత్త చట్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించలేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా కొత్త సాగు చట్టాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
'కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా కొత్త సాగు చట్టాలు' - వ్యవసాయ బిల్లులపై వడ్డే శోభనాద్రీశ్ర్వరావు కామెంట్స్
కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా కొత్త సాగు చట్టాలు ఉన్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. రాజ్యసభ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లులను ఆమోదించారని ఆరోపించారు.
కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా కొత్త సాగు చట్టాలు
TAGGED:
వ్యవసాయ చట్టాలు తాజా వార్తలు