ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ - కరోనా వ్యాక్సినేషన్ వార్తలు

ఆర్టీసీ ఉద్యోగుల్లో పలువురు కరోనా బారిన పడటంతో.. ఉద్యోగులందరికి కరోనా వ్యాక్సిన్ వేయించడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే వారందరికి వ్యాక్సిన్​ వేయాలని ఎండీ ఆర్పీఠాకూర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు.

vaccination for rtc employees
vaccination for rtc employees

By

Published : Apr 27, 2021, 9:28 PM IST

ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో.. ఉద్యోగులందరికీ వాక్సినేషన్ చేయించడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టింది. కార్యాలయంలో పనిచేసే వారందరికీ వ్యాక్సినేషన్ వేయాలని ఎండీ ఆర్పీఠాకూర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ హౌస్​లో సిబ్బందికి వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేసి వాక్సిన్లు వేశారు. వీటితో పాటు అన్ని డిపోల వారీగా ప్రత్యేక వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కండక్టర్లు, డ్రైవర్లు సహా సిబ్బందికి వాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details