విజయవాడలో బుద్ధా మీడిమా సమావేశం తెదేపా నుంచి వైకాపాలోకి చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెదేపా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. తెదేపాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను పొగిడిన నేతలు.. ఇప్పుడు పార్టీ మారిన వెంటనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేతంలో ఉన్న నేతలు కులం పేరుతో విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఆమంచి, అవంతిది అవకాశవాద రాజకీయాలని... వచ్చే ఎన్నికల్లో సీటు రాదని తెలిసే పార్టీ మారారని స్పష్టం చేశారు. కాపు సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సిద్ధమా అని అవంతి శ్రీనివాస్‌కి సవాల్ విసిరారు.