ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Center on Panchayati Raj Funds: 'ఆ​ నిధుల మళ్లింపుపై ఏపీ వివరణ తీసుకుంటాం' - పార్లమెంట్ సమావేశాలు

Panchayati Raj founds diversion: ఏపీలో పంచాయితీరాజ్‌ సంస్థల నిధులు మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుపై సమీక్ష జరుపుతామని పంచాయితీరాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. దీనిపై రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

పంచాయితీరాజ్ సంస్థల​ నిధుల మళ్లింపు
Center on Panchayat raj Funds

By

Published : Feb 2, 2022, 7:22 PM IST

Panchayati Raj founds diversion at AP: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీరాజ్‌ సంస్థలకు చెందిన నిధులు మళ్లించినట్లు వచ్చిన పిర్యాదులపై ఏపీ ప్రభుత్వం వివరణ తీసుకుంటామని కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. అనంతరం దీనిపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

'రాష్ట్రంలో పంచాయితీ రాజ్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే మళ్లించి ఉపసంహరించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇలా చేయడం వల్ల స్థానిక సంస్థలు బలహీనపడతాయి. ఇలాంటి వాటిని సరిదిద్ది.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిలో నిధులు ఉపసంహరించకుండా తగిన నిర్దేశాలు జరీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరించాలి' అని ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమీక్ష జరుపుతామని మంత్రి వెల్లడించారు. నిధులు పక్కదారి పట్టించినట్లు ఉంటే.. ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుంటామని.. దానిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details