విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ వచ్చే నెల 8న సమావేశం నిర్వహించనున్నారు. దీల్లీ నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో ఈ ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 9,10 షెడ్యూళ్ల పరిధిలోని సంస్థల విభజన, గిరిజన విశ్వవిద్యాలయం, విద్యుత్ సంస్థల బకాయిలు, రాష్ట్ర ఆర్థిక సంస్థ ఆస్తుల పంపిణీ, ఏపీ భవన్ విభజన, ఏపీలోని ఆప్మెల్ తదితర అంశాలను చర్చించనున్నారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కానున్నారు.
వచ్చే నెల 8న తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ - cs
విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వచ్చే నెల 8న కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు.
విభజన సమస్యలపై వచ్చే నెల 8న సమావేశం