Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును.. ఆ రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కోరారు. ఈడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సర్ఫరాజ్ ఆహ్మద్.. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామని పేర్కొన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలతోపాటు.. కెల్విన్ కేసులో సేకరించిన వాట్సప్ స్క్రీన్ షాట్లు ఈడీకి ఇచ్చామని తెలిపారు.
నిందితుల నుంచి కాల్‌డేటా రికార్డులను దర్యాపు అధికారులు సేకరించలేదన్న సర్ఫరాజ్ అహ్మద్.. సిట్ సేకరించిన 12 మంది కాల్‌డేటా, వీడియో రికార్డుంగులను ఈడీకి ఇచ్చామని చెప్పారు. కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదన్నారు. పాలనాపరమైన కారణాలతో ఈడీకి సమాచారమివ్వడం ఆలస్యమైందని పేర్కొన్నారు.