ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సామాన్య కార్యకర్త నుంచి.. శాసనసభ్యుడి వరకూ...

సైదిరెడ్డి విజయంతో తెలంగాణలోని హుజూర్​నగర్​ నియోజకవర్గంలో తెరాస సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఎన్​ఆర్​ఐగా అడుగుపెట్టిన సైదిరెడ్డి ఎన్నోసార్లు గెలుపు నల్లేరుపై నడకలా సాగలేదు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆయన సావాసం చేయాల్సి వచ్చింది. అన్నింటినీ అధిగమించి నిలుదొక్కుకోవడంతో చివరికి విజయం వరించింది.

trs-mla-candidate-saidireddy-biodata

By

Published : Oct 24, 2019, 3:20 PM IST


ఎన్ఆర్ఐగా అడుగుపెట్టిన సైదిరెడ్డి అతి తక్కువ కాలంలోనే ప్రజలకు దగ్గరయ్యారు. జగదీశ్ రెడ్డి అనుచరుడిగా మారి... సామాజిక కార్యక్రమాల ద్వారా యువతకు చేరువయ్యారు. ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరుకున్నారు. 2018 ఎన్నికల్లో ఉత్తమ్​పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినా.. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ప్రజల మనసును గెలుచుకున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న సైదిరెడ్డి... అన్ని పార్టీల కన్నా ముందుగా బీఫాం అందుకున్నారు.

కెనడా టు హుజూర్​నగర్​....

సైదిరెడ్డికి సవాళ్లు స్వీకరించడం సరదా. యూఎన్​ పాపులేషన్​ ఫండ్​లో ఉద్యోగం వదిలేసి 2005లో కొత్త ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లారు. అక్కడ తన భార్యతో కలిసి 'మయూరి ఇండియన్ క్యూసైన్​' పేరుతో ఓ హోటల్ ప్రారంభించారు. పంజాబీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో హోటల్​ను తెరవడం వల్ల లాభాలు కూడా బాగానే వచ్చాయి. తర్వాత కాలంలో అవన్ని వదిలేసి భారత్​లో అడుగుపెట్టిన సైదిరెడ్డి రాజకీయాల్లోకి దిగారు. పీసీసీ అధ్యక్షునిపైనే పోటీ చేసి గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈసారి కాంగ్రెస్​ కంచుకోటను బద్దలుకొట్టి తెరాస జెండాను రెపరెపలాడించారు.

కేసీఆర్​కు సైదిరెడ్డిపై నమ్మకం...

సైదిరెడ్డిపై ముఖ్యమంత్రికి అంతగా నమ్మకం ఉండడానికి కారణం... ఆయన స్థానికుడు కావడం ఒకటైతే... మఠంపల్లి మండలం గుండ్లపల్లికి చెందిన సైదిరెడ్డి కుటుంబానికి ముందు నుంచి రాజకీయ నేపథ్యం ఉండటం మరో కారణమని చెప్పుకోవచ్చు.

సైదిరెడ్డి వాక్చాతుర్యం...

గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన సైదిరెడ్డికి ప్రస్తుత గెలుపునకు మరో ప్రధాన కారణం ఆయన కాంగ్రెస్​పై ఎక్కుపెట్టిన మాటల తూటాలే. కాంగ్రెస్​కు ఓటేస్తే ఉత్తమ్​ కుటుంబానికి మరో సీటు వస్తుందే తప్ప అభివృద్ధి జరగదని ప్రచారం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానని... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి అవుతానని మాయమాటలు చెప్పి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఓట్లు దండుకున్నారని సైదిరెడ్డి చేసిన ఆరోపణలు కలిసోచ్చాయి. మూడేళ్లలో హుజూర్​నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సైదిరెడ్డి ఇచ్చిన భరోసాను ఓటర్లు నమ్మారు.

పల్లా రాజకీయ చతురత...

తెలంగాణలోని హుజూర్​నగర్​ ఉపఎన్నికల ప్రధాన బాధ్యతను పల్లా రాజేశ్వర్​ రెడ్డికి అప్పగించారు కేసీఆర్​. ప్రచార బాధ్యతను జగదీశ్​ రెడ్డికి చూసుకున్నారు. పల్లా రాజకీయ చతురత, వ్యూహశైలి కలిసివచ్చిందని చెప్పుకోవచ్చు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అధికంగా కలిగిన అధికార పార్టీ... ఈ ఎన్నికల్లో గెలుపునకు మరో కారణం.

ABOUT THE AUTHOR

...view details