ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అడుగు ముందుకేశారు.. అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు - latest news of corona

కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రంలో లాక్​ డౌన్.. రోడ్లన్నీ నిర్మానుష్యం. ఎటుచూసినా పోలీసుల పహారాలు, చెక్​పోస్టులు. మూసివేసిన దుకాణాలు. తినడానికి ఏం దొరకని పరిస్థితి. ఫలితంగా.. యాచకుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. రోడ్లపై జనం కనిపిస్తే తప్ప రూపాయి దొరకని వారి జీవితాల్లో.. లాక్​డౌన్ అంధకారాన్ని నింపుతోంది. పూట గడవని పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు పలువురు ముందుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టిఫిన్​తో పాటు భోజనాన్ని అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

trouble of beggars in state wide over corona affect
trouble of beggars in state wide over corona affect

By

Published : Mar 25, 2020, 8:07 PM IST

'అడుగుముందుకేశారు..అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు'

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. చిన్నాపెద్దా తేడా చూపించకుండా కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దేశం మొత్తం లాక్​డౌన్ అని కేంద్రం నిర్ణయం తీసుకోగా.. రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధిస్తూ రోడ్లపై జన సంచారం లేకుండా చేస్తున్నారు. ప్రజలు ఎవరూ నగరాల్లో తిరగడమే మానేశారు. ఎంతో మంది అనాథలు, దిక్కులేని ముసలివారు, యాచకులు ఆకలితో బాధపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారి పట్ల కొందరు ఔదార్యం చూపుతూ ఆహారం అందిస్తున్నారు.

ప్రకాశం జిల్లా చీరాలలో ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. రైల్వే స్టేషన్ మూతపడింది. రోజుకో ఊరు తిరిగే సంచారుల పరిస్దితి దారుణంగా మారింది. ఇలాంటి వారికి వైకుంఠపురానికి చెందిన వై.లోకేష్, ఎస్.కె. అలీ అనే ఇద్దరు లారీ డ్రైవర్లు భోజన వసతి సమకూర్చారు. మూడు రోజుల నుంచి రైల్వేస్టేషన్ ఆవరణలోని చెట్టు కింద తలదాచుకుంటున్న 40 మందికి భోజనాలు పెడుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో కంచికచర్ల రహదారుల వెంట తిరిగే యాచకులకు పోలీసులు భోజనం ఏర్పాటు చేశారు.

విజయవాడలోని జవహర్ ఆటోనగర్​లో... లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. మెకానిక్ షెడ్లు మూతపడ్డాయి. హోటళ్లు మూసివేసిన కారణంగా.. తినడానికి భోజనం లేక ఆటో మైబైల్ సిబ్బంది అవస్థలు పడుతోంది. వారి ఇబ్బందులను గుర్తించిన జవహర్ ఆటో నగర్ ఐలా సర్వీస్ సొసైటీ.. ప్రతి రోజు కార్యాలయ ప్రాంగణంలోనే భోజనం వండి ప్యాకింగ్ చేస్తున్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులతో పాటు పోలీసులకు కూడా ఆహారాన్ని అందజేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రమాదం పొంచి ఉంది...తస్మాత్ జాగ్రత్త..!

ABOUT THE AUTHOR

...view details