ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు  @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM

By

Published : Jul 14, 2021, 9:00 PM IST

  • కీలక పరిణామం!

జగన్‌ బెయిల్‌ రద్దు (Jagan's bail revocation) కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టు (CBI COURT)లో మరోసారి విచారణ చేసింది. ఈనెల 8న జగన్, రఘురామకృష్ణరాజు తమ వాదనలను లిఖిత పూర్వకంగా న్యాయస్థానానికి సమర్పించారు. ఈ విషయమై మరోసారి వాదనలు కొనసాగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వాళ్లంతా జైలుకే: చంద్రబాబు

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా పాలనలో రైతులు, సామాన్యులు ఎవరూ సంతోషంగా లేరని ఆగ్రహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఇబ్బందులను పట్టించుకోండి'

పోలవరం ప్రాజెక్టు(polavaram project) నిర్మాణంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల (Expatriates)ఇబ్బందులను పట్టించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(BJP leader somu veerraju) అన్నారు. రాష్ట్రం ఇస్తున్న నిధులను కేంద్రం సర్దుబాటు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ(vizag steel plant) విక్రయం జరగనివ్వమని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తగ్గుదల

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 90,204 పరీక్షలు నిర్వహించగా.. 2,591 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,29,579 మంది వైరస్‌ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మళ్లీ లాక్​డౌన్​

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. అయితే ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రం విపరీతంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజే మరో 15,600 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వారాంతపు సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ' అలా చేస్తేనే విజయం!'

వయోజనులందరికీ డిసెంబర్​ నాటికి టీకా వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ప్రస్తుతం అనుసరిస్తున్న వేగమే ఇకపైనా కొనసాగితే.. ఆ లక్ష్యం చేరుకోవడం అసాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కోటి చొప్పున టీకా డోసులను పంపిణీ చేసినప్పుడే.. ఇది సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పాక్‌లో ఉగ్రదాడి

వాయవ్య పాకిస్థాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనా ఇంజినీర్లు, కార్మికులు, పాక్​ భద్రత సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. కోహిస్థాన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 9 మంది చైనీయులు సహా మొత్తం 13 మంది మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ధర, ఫీచర్లు ఇవే..

భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది ఒప్పొ. రెనో సిరీస్​కు కొనసాగింపుగా.. రెనో 6, రెనో 6ప్రో వంటి వేరియంట్లను బుధవారం ఆవిష్కరించింది. ఈ రెండు వేరియంట్ల ఫీచర్లు, ధర వివరాలు మీకోసం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఒలింపిక్స్​కు కరోనా భయం

ఒలింపిక్స్(Tokyo Olympics) ఆతిథ్య నగరం​ టోక్యోలో కరోనా కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో సమావేశమైన జపాన్​ ప్రధాన మంత్రి యోషిహిదే సుగ, అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​.. విశ్వక్రీడలు సురక్షితంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మూవీ ముచ్చట్లు

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, హైవే, మాస్ట్రో, ఒకే ఒక జీవితం, ఎస్.ఆర్.కల్యాణ మండపం, సెబాస్టియన్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details