ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - తెలుగు ప్రధాన వార్తలు

.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-October-2020/9346967_18_9346967_1603898855929.png
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-October-2020/9346967_18_9346967_1603898855929.png

By

Published : Oct 28, 2020, 8:59 PM IST

  • 'ఎన్నికల నిర్వహణ కష్టం'
    రాష్ట్రంలో కరోనా అదుపులోకి రాలేదని సీఎస్ నీలం సాహ్నీ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని స్పష్టం చేశారు. బుధవారం ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్​తో సమావేశమైన సీఎస్ నీలం సాహ్నీ... ఈ మేరకు నివేదిక అందజేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తగ్గుముఖం
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,949 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,14,774కు చేరింది. మృతుల సంఖ్య 6,643కి ఎగబాకింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'రైతులకు చెప్పాలి'
    అరెస్ట్ అయిన అమరావతి రైతుల కుటుంబాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అమరావతి రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విషాదయాత్ర
    పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట శివారు వసంతవాడలో హృదయ విదారక ఘటన జరిగింది. సరదాగా ఈత కొట్టేందుకు వసంతవాడ వాగులోకి దిగిన ఆరుగురు యువకులు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆటవిక రాజ్యానికి రాకుమారుడు'
    బిహార్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​పై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ఆటవిక రాజ్యానికి యువరాజు అంటూ తేజస్వీపై నిప్పులు చెరిగారు. 10 లక్షల ఉద్యోగాల హామీని ఎగతాళి చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సీఎంపై సీబీఐ దర్యాప్తు
    అవినీతి ఆరోపణలతో ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఆ రాష్ట్ర హైకోర్టు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రావత్​ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బైడెన్​ సిద్ధమేనా?
    ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం కరోనా సంక్షోభం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్ష పదవిని చేపట్టడం ఎవరికైనా సవాలే. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆదరణ పెరుగుతోంది'
    ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఇంగ్లాండ్​ మహిళా జట్టు కోచ్​ రాబిన్ ​సన్​.. 2017 మహిళా ప్రపంచకప్​ను గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ఫైనల్లో ఇంగ్లాండ్​పై భారత్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అలరిస్తోన్న సాంగ్
    స్టార్ హీరోయిన్​ కీర్తి సురేశ్​ ప్రధానపాత్రలో నటించిన 'మిస్​ ఇండియా' ట్రైలర్​ నెట్టింట విశేషాదరణ దక్కించుకుంటోంది. నెట్​ఫ్లిక్స్​ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో లిరికల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details