ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - తాజా వార్తలు

.

top news@7pm
ప్రధాన వార్తలు@7pm

By

Published : May 19, 2020, 7:00 PM IST

  • నీటి విడుదల ఆపండి..

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయవాడ, తిరుపతికి 3 స్టార్

స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే నగరాలకు ఇచ్చే రేటింగ్ వివరాలను వెల్లడించారు​ కేంద్ర మంత్రి హర్​దీప్ సింగ్ పూరీ. ముంబయి, మైసూర్, ఇండోర్​ సహా మొత్తం ఆరు నగరాలను '5 స్టార్ గార్బేజ్ ఫ్రీ' నగరాలుగా ప్రకటించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మూడు రోజుల్లో రయ్​..రయ్​

రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజారవాణా ప్రారంభమవుతుందని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని.. భౌతికదూరం పాటించేలా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సొంతగూటికి 20 లక్షల మంది

మే 1 నుంచి ఇప్పటివరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 20 లక్షల మంది వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చామని భారతీయ రైల్వే ప్రకటించింది. ఇకపై మరిన్ని రైళ్లను కూడా నడుపుతామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వలస' కష్టాలపై చర్చకు కాంగ్రెస్ పిలుపు!

లాక్​డౌన్​ నేపథ్యంలో కార్మికుల కష్టాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ.. భావసారూప్య పార్టీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయనుంది. వలస కూలీలు, కార్మిక చట్టాల సవరణలపై చర్చించేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయం ఎలా?

కశ్మీర్​... సువిశాల భారతావనికి మకుటం. అందాల లోయలు, హిమపాతాల సోయగాల సమాహారం. అయితే ఇందతా ఒకవైపే. నాణానికి మరోవైపు చూస్తే.. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్​లో తుపాకీ తూటా వినిపించని రోజు లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అప్పుడే అడ్వాన్స్...

'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో మైత్రీ మూవీ మేకర్స్​ ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోందట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రశాంత్​కు మైత్రీ సంస్థ అడ్వాన్స్​ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అలా చెప్పాడు

వీరేంద్ర సెహ్వాగ్​ అత్యధిక పరుగుల రికార్డు అధిగమించాలని యువరాజ్​ తనకు సూచించినట్లు రోహిత్​ శర్మ తెలిపాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో 209 పరుగులతో వెనుదిరిగిన సమయంలో యువీ ఆ మాట తనతో అన్నాడని తాజాగా గుర్తు చేసుకున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రచారం ఎక్కువ- విషయం తక్కువ

ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్​ సొల్యూషన్స్... మోదీ ప్రకటించిన కరోనా ప్యాకేజీపై సునిశిత విమర్శలు చేసింది. ప్యాకేజీ చూడడానికి చాలా భారీగా కనిపిస్తున్నా.. వాస్తవంలో అది చాలా చిన్నదని తేల్చిచెప్పింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details