ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5pm - ఏపీ తాజా వార్తలు

.

top news@5pm
ప్రధాన వార్తలు@5pm

By

Published : May 21, 2020, 5:00 PM IST

  • విశాఖలో మరో కలకలం...

విశాఖలో మరోసారి కలకలం నెలకొంది. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో గొట్టాల నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఒక్కసారిగా తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలుగు మాధ్యమం తప్పనిసరి

తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరోసారి విచారణకు రావాలి..

గుంటూరు సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మ విచారణ ముగిసింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు ఆమెకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అక్రమాలను ప్రశ్నిస్తే వేధింపులా..?

పోలీసుల వేధింపులు తట్టుకోలేక తమ పార్టీ నాయకుడు లోకేశ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని జనసేన అధినేత పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించిన లోకేశ్​ను ఆత్మహత్యకు ప్రేరేపించిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెరిగిన నిరుద్యోగం రేటు

లాక్​డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది జీవనోపాధి కోల్పోయారు. నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రాజీవ్​కు నివాళిగా కిసాన్​ న్యాయ్​ యోజన'

మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఛత్తీస్​గఢ్​లో 'రాజీవ్​ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన'ను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లక్షన్నర టికెట్లు ఉఫ్!

జూన్​ 1న ప్రారంభం కానున్న రైళ్లకు డిమాండ్ పెరిగింది. కేవలం 2 గంటల్లోనే దాదాపు లక్షన్నర టికెట్లు బుక్ అయ్యాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ తరగతులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సచినే ఉత్తమ క్రికెటర్​

వన్డేల్లో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కంటే సచిన్​ తెందూల్కర్ ఉత్తమ బ్యాట్స్​మన్​ అని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్విగ్గీలో ఆల్కహాల్ హోం డెలివరీ షురూ

మందుబాబులకు మద్యాన్ని ఇంటికే తీసుకొచ్చే సేవలు ప్రారంభించింది స్విగ్గీ. రాంచీలో మద్యం హోండెలివరీ మొదలుపెట్టినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అతని తమ్ముడే కారణం!'

బాలీవుడ్ హీరో​ నవాజుద్దీన్​ సిద్ధిఖీ కుటుంబం తనను వేధించిందని ఆయన భార్య ఆలియా ఆరోపించారు. అయితే నవాజుద్దీన్​ మాత్రం ఆమెపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని తెలిపారు. వాళ్లు పెట్టిన హింసకు మొదటి భార్య వదిలి వెళ్లిపోయిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details