ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ఏపీ ప్రధాన వార్తలు

.

top news
ప్రధాన వార్తలు @ 1PM

By

Published : Dec 2, 2020, 12:59 PM IST

  • ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తా: పవన్​కల్యాణ్​

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు... జనసేనాని పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు పవన్ ముందు కంటతడి పెట్టగా... నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి

గత నెలలో గాజువాక యువతి హత్యోదంతం మరువకముందే.. విశాఖలో మరో దారణం చోటు చేసుకుంది. ఫెర్రీ జంక్షన్‌ వద్ద యువతి మెడపై యువకుడు కత్తితో దాడి చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి ట్రైన్​ సౌకర్యం

షిర్డీకి వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ ఓ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్‌, కాకినాడల నుంచి షిర్డీకి ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూ. 353 కోట్లతో పూడికమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌!

చేపల వేట సురక్షితంగా సాగడానికి.. సముద్ర ఉత్పత్తులకు విలువ జోడించి మార్కెట్‌ చేసుకోవడానికి అధునాతన ఫిషింగ్‌ హార్బర్‌ను పూడిమడక వద్ద నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కొన్నాళ్లగా ప్రతిపాదనల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఉగ్రవాదం వల్ల అలాంటి మరో మారణహోమం'

ఉగ్రవాదం ప్రపంచానికి పెనుసవాలుగా మారుతోందని ఐక్యరాజ్య సమితి వేదికగా మరోమారు నొక్కిచెప్పింది భారత్​. సమకాలీన ప్రపంచంలో యుద్ధం చేసే సాధనాల్లో ఉగ్రవాదం ఒకటిగా మారిందని, రెండు ప్రపంచ యుద్ధాల్లో చూసినటువంటి మారణహోమంలోకి ప్రపంచాన్ని నెడుతోందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిన్న సంకల్పంతో గొప్ప ఆవిష్కరణ

వారికి వచ్చిన చిన్న ఆలోచనతో దివ్యాంగులు కోసం గొప్ప ఆవిష్కరణే చేశారు ఈ చిన్నారులు. రోడ్డు పై వెళ్తుంటే రోజు జరిగే సంఘటనల నుంచి ప్రేరణ పొందారు. పాఠశాలలో ఉండే 'అటల్​ పరిశోధనాలయం'లో ఉండే పరికరాలతో మెదడుకు పని పట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బుల్లెట్​ రైలుకు పర్యావరణ అనుమతులు

గుజరాత్​- మహారాష్ట్ర మధ్య నిర్మించనున్న బుల్లెట్​ రైలు ప్రాజెక్టకు పర్యావరణ అనుమతులు లభించాయని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 67శాతం భూమిని సేకరించినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హెచ్‌ 1బీ వీసా ఆంక్షలపై ట్రంప్​కు చుక్కెదురు

హెచ్​-1బీ వీసాల అంక్షలపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కొద్ది రోజుల క్రితం విధించిన ఆంక్షలను కొట్టివేసింది కాలిఫోర్నియా కోర్టు. కొత్త నిబంధనల అమలుకు ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని అభిప్రాయపడ్డారు ఈ కేసును విచారించిన న్యాయమూర్తి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బీఎస్​ఈని సందర్శించిన యోగి ఆదిత్యనాథ్

లఖ్​నవూ మున్సిపల్ కార్పొరేషన్​ (ఎస్​ఎంసీ) బాండ్ల లిస్టింగ్ సందర్భంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీని సందర్శించారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్​. ఈ సందర్భంగా బుధవారం సెషన్​ను ఆయన ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నేను ట్రాన్స్​జెండర్​ని- నటి వెల్లడి

  • హాలీవుడ్​ నటి ఎలెన్​ పేజ్​.. తాను ట్రాన్స్​జెండర్​ అన్న విషయాన్ని ట్విట్టర్​ ద్వారా బయటపెట్టారు. తన పేరును ఎలియట్​ పేజ్​గా మార్చుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details