నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం(Rain Forecast) ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ(ap weather news) తెలిపింది. ఇది శ్రీలంక- దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26,27, 28 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు(TODAY WEATHER REPORT) కురుస్తాయని తెలిపింది. కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చునని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశముందని వెల్లడించింది.