మన దేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరెక్కడా లేరని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యనించారు. కృష్ణాజిల్లా ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్టును సందర్శించిన ఆయన..యువతకు శిక్షణ ఇచ్చి వాళ్లలోని సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. ప్రధానిగా మోదీ దేశ నైపుణ్యాన్ని పెంపొందించేలా సంస్కరణలు చేస్తున్నారన్నారు. విద్య కేవలం ఉద్యోగానికే పరిమతం కాకూడదని వ్యాఖ్యనించారు. విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం దేశ సంస్కృతిలో మిళితమై ఉందన్నారు. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా విజ్జానంతో కూడిన వృత్తి విద్య నేర్పడం హర్షణీయమన్నారు. దేశ పౌరులందరూ సోదరభావంతో మెలగాలన్నారు. మన తక్షణ కర్తవ్యం రెండంకెల వృద్ధి సాధించడమేనన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు.
యువతలోని ప్రతిభను వెలికి తీయాలి: ఉప రాష్ట్రపతి
యువతకు శిక్షణనిచ్చి వారిలో సృజనాత్మకతను వెలికితీయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్యనించారు. మన దేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.
ఉపరాష్ట్రపతి