ప్రభుత్వం కీలక నిర్ణయం... మెమో జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ - online GO
15:46 August 16
ప్రభుత్వం కీలక నిర్ణయం... మెమో జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ
ప్రభుత్వ ఉత్తర్వులను ఇకపై ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం అందించింది. ఇకపై ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇటీవల బ్లాంక్ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాల విధానాలను అనుసరించాలని నిర్ణయించింది. 2008లో వైఎస్ హయాం నుంచి ఆన్‌లైన్‌లో జీవోలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది.
ఇదీచదవండి.