రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత తారాస్థాయికి చేరిపోతోంది. భానుడి ప్రతాపంతో వడగాడ్పుల తీవ్రత గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువైంది. రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గరిష్టంగా తిరుపతిలో 43.5 డిగ్రీలు.. విజయవాడలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 41.7 డిగ్రీలు, ఒంగోలు 36.7 డిగ్రీలు, అనంతపురం 43.5 డిగ్రీలు, కాకినాడ 40.6, కర్నూలు 38.8, నెల్లూరు 38.6, శ్రీకాకుళం 41 డిగ్రీలు, పార్వతీపురంలో 42.22 డిగ్రీలు, విజయనగరం 41.2, విశాఖ 40.2, అనకాపల్లి 41.76, రంపచోడవరం 41.1, రాజమహేంద్రవరం 42.2, భీమవరం 40, ఏలూరు 41.4, మచిలీపట్నం 41, గుంటూరు 41, ఒంగోలు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
AP Weather Alerts: రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు.. రాగల రెండు రోజుల్లో హై అలర్ట్ - రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు
రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువైంది. రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలో భానుడి ప్రతాపం
మరోవైపు.. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల కారణంగా దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. అటూ.. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:POLAVARAM: ఆలస్యమనుకుంటే.. మీరే డిజైన్లు ఖరారు చేసుకోండి: డీడీఆర్‌పీ