Balakrishna inaugurated Oxygen Plant:ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తూ... బసవతారకంలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి ఛైర్మన్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సిజన్ ప్లాంటును బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ప్రత్యేక పూజలు చేశారు.
కరోనాను అరికట్టడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించాం. ఆక్సిజన్, మందులు, వెంటిలేటర్ ఎలాంటి కొరత లేకుండా చూశాం. కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశాం. కొత్త వేరియంట్లు ఎదుర్కునేందుకు ఆస్పత్రి సిబ్బంది సన్నద్ధంగా ఉంది.-నందమూరి బాలకృష్ణ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్
Oxygen plant in Basavatarakam hospital: రూ.1.2 కోట్ల విలువైన ఈ ప్లాంటును దిగ్గజ ఫార్మా సంస్థ నొవార్టిస్ సహాయంతో ఏర్పాటు చేశామని బాలకృష్ణ తెలిపారు. కొవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్నామని బాలయ్య గుర్తు చేసుకున్నారు.