గతంలో ఇచ్చిన వినతులనే మళ్లీ మళ్లీ ఇస్తున్నారే తప్ప.. దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ సాధించిందేమిటో చెప్పాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. సీఎం జగన్.. ప్రధానిని, ఆర్థికమంత్రిని కలవడం సంతోషంగా ఉందన్న కనకమేడల.. భేటీలో ఏం జరిగిందో బయటికి చెప్పాలని కోరారు. గతంలో పోలవరంపై సీఎం జగన్ రాసిన లేఖ వల్లే ఈరోజు రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీనామా చేసేందుకు సిద్ధమా..?
భేటీలో ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్, రైల్వేజోన్‌పై ఎందుకు చర్చించలేదని కనకమేడల ప్రశ్నించారు. ఈ పరిస్థితిని చూస్తుంటే ఆ ప్రాజెక్టులకు తిలోదకాలు ఇచ్చినట్లు అర్థమవుతోందని అన్నారు. సీఎం జగన్ గతంలో 2సార్లు ప్రధానిని కలిశారని, అప్పుడు అవే డిమాండ్లు, ఇప్పుడు కూడా అవే డిమాండ్లు కోరారని వివరించారు.