ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Pattabhi on Ration Rice : 'కొడాలి నాని, ద్వారంపూడి పేదల బియ్యాన్ని కొల్లగొడుతున్నారు' - TDP Pattabhi on Ration Rice

TDP Pattabhi on Ration Rice : మంత్రి కొడాలి నాని, కాకినాడ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతున్నారని తెలుగుదేశం నేత పట్టాభి ఆరోపించారు.

TDP Pattabhi on Ration Rice
కొడాలి నాని, ద్వారంపూడి పేదల బియ్యాన్ని కొల్లగొడుతున్నారు -తెదేపా

By

Published : Feb 18, 2022, 11:59 AM IST

కొడాలి నాని, ద్వారంపూడి పేదల బియ్యాన్ని కొల్లగొడుతున్నారు -తెదేపా

TDP Pattabhi on Ration Rice : మంత్రి కొడాలి నాని, కాకినాడ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. గోడౌన్ల నుంచి రేషన్ బియ్యం దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. బియ్యం అక్రమ రవాణాపైనే ద్వారంపూడి కుటుంబం బతికేస్తోందని అన్నారు.

దేశంలో మరే పోర్టు నుంచి పెరగనంతగా కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయని విమర్శించారు. అక్రమంగా ఎగుమతి చేసిన బియ్యాన్ని ఆఫ్రికా ఖండంలోని ఐవరీ కోస్ట్‌లో ఉన్న ద్వారంపూడి గోడౌన్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఐవరీ కోస్ట్‌లో గోడౌన్లు నిర్మించుకున్నట్లు గతంలో ద్వారంపూడి మాట్లాడిన వీడియోను పట్టాభిరాం ప్రదర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details