రాష్ట్రంలో గత 15 నెలలుగా అప్పు భారం ప్రజలపై నిమిషానికి రూ.15 లక్షలు ఉందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. కాగ్ నివేదికలోని అంశాలు పరిశీలిస్తే.... చాలా ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని పట్టాభి మండిపడ్డారు. దేశంలోనే తనకంటే గొప్ప ఆర్థికమంత్రి లేడని చెప్పుకునే బుగ్గన ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ.. నల్లధనాన్ని విదేశాలకు తరలించే పనిలో జగన్ నిమగ్నమయ్యారని పట్టాభి విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నది చాలక... విశాఖలో అప్పుచేసి మరీ గెస్ట్ హౌస్ కట్టాలా అని ప్రశ్నించారు.
ప్రజలపై నిమిషానికి రూ.15 లక్షల అప్పు...: పట్టాభి - విజయవాడ వార్తలు
రాష్ట్రప్రభుత్వంపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు.
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్