విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ నేతలు చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు విరమించారు. ఎస్సీల హక్కులు కాపాడాలని చేపట్టిన ప్రతిఘటన ర్యాలీతి అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగారు. సీతమ్మపేటలో ఫంక్షన్ హాల్ ఎక్కి 5 గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తెదేపా ఎస్సీ సెల్ నేతలతో పోలీసులు పలుమార్లు చర్చలు జరిపారు. అరెస్ట్ చేసిన వారిపై కేసులు ఎత్తివేస్తామని.. మరోసారి దరఖాస్తు చేస్తే ర్యాలీకి అనుమతిస్తామని పోలీసులు తెలపడంతో ఎస్సీ సెల్ నేతలు ఆందోళనలను విరమించారు.