మన్సాస్ ట్రస్ట్‌ను రక్షించాలంటూ... తెదేపా ఎమ్మెల్సీలు ద్వారంపూడి జగదీశ్వరరావు, గుమ్మడి సంధ్యారాణి, పి.రఘు, పి.చలపతిరావు, బుద్దా నాగజగదీశ్వరరావు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విద్యా సాంస్కృతిక రంగాల కోసం ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వర్తించేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజును తప్పించారని.. అనైతికంగా కొత్త బోర్డును ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్తబోర్డు నిర్ణయాలతో విద్యా, సాంస్కృతిక సంస్థలకు జీతాలు అందని పరిస్థితి వచ్చిందని.. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉందని తెదేపా ఎమ్మెల్సీలు తెలిపారు. తక్షణమే ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిరక్షించాలని గవర్నర్‌ను కోరారు.
మాన్సాస్ ట్రస్ట్‌ను కాపాడాలి: గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు - మన్సాస్ ట్రస్టుపై గవర్నర్‌కు టీడీపీ ఎమ్మెల్సీల ఫిర్యాదు వార్తలు
మాన్సాస్ ట్రస్ట్‌ను కాపాడాలంటూ తెదేపా ఎమ్మెల్సీలు గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవర్నర్ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.
మాన్సాస్ ట్రస్ట్‌ను కాపాడాలి: గవర్నర్‌కు తెదేపా ఎమ్మెల్సీల ఫిర్యాదు