ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నేతలు లాక్​డౌన్​ను ఉల్లంఘించారు: బుద్దా

ముఖ్యమంత్రి జగన్ చర్యల వల్ల కరోనా వైరస్ ప్రభావం.. రాష్ట్రంలో మూడో దశకు చేరుకుందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.

tdp mlc budda venkanna
తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

By

Published : Apr 10, 2020, 12:29 PM IST

కరోనా నివారణకు దేశం మొత్తం ముందే మేల్కొంటే.... ముఖ్యమంత్రి జగన్ సెలవిచ్చిన బ్లీచింగ్, పారాఎసిటమాల్ సలహాలతో రాష్ట్రంలో వైరస్ మూడో దశకు చేరుకుందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ కు పరిపాలన చేతకాదన్నది రాష్ట్ర ప్రజలకు ఆయన చర్యలతో తేట తెల్లమైందని దుయ్యబట్టారు. లాక్​డౌన్ ఆంక్షలను వైకాపా ప్రజాప్రతినిధులు ఉల్లంఘిస్తే... వారిని ఎందుకు క్వారంటైన్​లో పెట్టలేదని నిలదీశారు.

'వెయ్యి రూపాయలు ఏం సరిపోతాయ్?'

రాష్ట్ర మంచి కోసం ప్రభుత్వానికి తెదేపా అధినేత చంద్రబాబు కీలక సూచనలు చేస్తూ.. లేఖలు రాస్తుంటే... వైకాపా నేతలు తప్పు బట్టడం దురదృష్టకరమని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో వైద్యులు కూడా కరోనా బారినా పడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆగ్రహించారు. సంక్షోభ సమయంలోనూ సొంత పత్రిక సాక్షికి కోట్లాది రూపాయలు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

కాకుల మరణం.. స్థానికుల్లో భయం భయం!

ABOUT THE AUTHOR

...view details