ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్​లకు తాళాలు వేయాలి: తెదేపా

By

Published : Mar 10, 2021, 9:19 PM IST

పురపాలక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్​లకు తాళాలు వేయాలని తెదేపా నేత అశోక్ బాబు ఎస్​ఈసీని కోరారు.

అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్​లకు తాళాలు వేయాలి
అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్​లకు తాళాలు వేయాలి

అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్​లకు తాళాలు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగు దేశం పార్టీ కోరింది. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్​ను కలిసిన తెదేపా నేత అశోక్ బాబు ఈ మేరకు వినతి పత్రం అందించారు. పురపాలక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. 2013లో 70 శాతం పోలింగ్ నమోదు కాగా...ఈసారి 62.28 శాతం మాత్రమే నమోదైందన్నారు.

ఓటర్ జాబితా లోపభూయిష్టంగా ఉందని..,సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటే గల్లంతు కావటమే దీనికి నిదర్శనమన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్​లో ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నందున..అక్కడ అధికారులు ఏమైనా చేస్తారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పార్టీలు‌, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్​లకు తాళం వేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details