ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు: చంద్రబాబు - తెదేపా 2022 మహానాడు

తెలుగుదేశం పసుపు పండుగ మహానాడును ఈ ఏడాది ఒంగోలులో నిర్వహించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈసారి మహానాడు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై పొలిట్‌బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు
ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు

By

Published : Apr 19, 2022, 5:27 PM IST

ఈ ఏడాది మహానాడును ఒంగోలులో నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లు పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించారు. 2018లో విజయవాడలో జరిగిన మహానాడు అనంతరం మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఈసారి భౌతికంగా నిర్వహించనున్నారు. ఈసారి మహానాడు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై పొలిట్‌బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడితో పాటు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికను నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details