ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ దృష్టి మళ్లించేందుకే.. పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు: తెదేపా - వైకాపాపై తెదేపా నేతల మండిపాటు

TDP leaders fires on YSRCP: వరుసగా అయిదో రోజూ.. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయటం దుర్మార్గమని తెదేపా నేతలు మండిపడ్డారు. నాటుసారా మరణాలపై నుంచి దృష్టి మళ్లించేందుకే.. అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని విమర్శించారు.

TDP leaders fires on YSRCP over pegasus
వైకాపాపై తెదేపా నేతల మండిపాటు

By

Published : Mar 21, 2022, 1:08 PM IST

పెగాసస్‌పై దర్యాపు చేసి నిజానిజాలు ప్రజల ముందుంచాలి: తెదేపా

TDP leaders fires on YSRCP: నాటుసారా మరణాలపైనుంచి దృష్టి మళ్లించేందుకే.. అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. వరుసగా అయిదో రోజూ.. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పార్లమెంటులో పెగాసస్‌పై చర్చ వద్దన్న వైకాపా.. అసెంబ్లీలో మాత్రం చర్చకు పట్టుపడుతోందని ఎద్దేవా చేశారు.

అధికారం ఉంది కనుక..పెగాసస్‌పై దర్యాపు చేసి నిజానిజాలు తేల్చి ప్రజల ముందుంచాలని సవాల్ చేశారు. చంద్రబాబు మీద బురద జల్లడానికే.. మమత బెనర్జీతో ఫేక్ మాటలు చెప్పించారని ఆరోపించారు. మద్యం, సారా కారణంగా రాష్ట్రంలో వెయ్యిమందికి పైగా చనిపోయారని నేతలు ఆరోపించారు. తాడేపల్లికి వచ్చే మద్యం ఆదాయం తగ్గుతుందనే.. పెగాసెస్​ పై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details