ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహారాజా ఆసుపత్రి మరణాలపై తెదేపా నేతల ఆగ్రహం - maharaja hopital deaths

విజయనగరంలోని మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక కొవిడ్​ రోగులు మృతి చెందడంపై తెదేపా నేతలు స్పందించారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే సంభవించాయని వారు ఆరోపిస్తున్నారు.

కిమిడి నాగార్జున, గుమ్మిడి సంధ్యారాణి
మహారాజా ఆసుపత్రి మరణాలపై తెదేపా నేతల ఆగ్రహం

By

Published : Apr 26, 2021, 6:34 PM IST

విజయనగరంలోని మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేక బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించడంపై తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున నిలదీశారు. దాదాపు పదిమంది చనిపోతే ఇద్దరే చనిపోయినట్లు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. జిల్లాలో ప్రతిష్ఠాత్మక ఎమ్మార్ ఆసుపత్రిలో సాంకేతిక ఇబ్బంది తలెత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి విషమంగా ఉన్నా జిల్లా మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ సమీక్షించక పోవడంపై ఆయన మండిపడ్డారు. వాస్తవాలు కప్పిపుచ్చే ధోరణి మాని బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరించాలని కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు.

మహారాజ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణాలు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. ఆసుపత్రుల్లో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకుండా.. వాటికి తగిన నిధులివ్వకుండా వైద్యులను నిందించడం తగదన్నారు. రోగులు ఆక్సిజన్ కొరతతో మరణించినట్లు వైద్యలు చెబుతుంటే ప్రభుత్వం మాత్రం వాటిని కరోనా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని ఆమె ఖండించారు. మృతుల సంఖ్యను దాచి ప్రజలను మోసగించాలని సర్కారు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

"ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. విజయనగరం మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కొందరు మృతి చెందడంపై దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. ప్రతిపక్షంలో ఉండి ప్రతిరోజూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరిస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆక్సిజన్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. పారాసెట్ మాల్, బ్లీచింగ్ పౌడర్ అని కబుర్లు ఆపి, ప్రజల ఆరోగ్యంపై.. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి." - గుమ్మిడి సంధ్యారాణి

ABOUT THE AUTHOR

...view details