ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిశ్రమలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదా..?

విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీపై ప్రభుత్వ తీరును తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరావు తప్పుబట్టారు. బాధితులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. కంపెనీ ప్రతినిధులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని దేవినేని ఉమ ప్రశ్నించారు.

By

Published : May 8, 2020, 11:29 PM IST

http://10.10.50.70:6060//finalout1/himachal-pradesh-nle/thumbnail/08-May-2020/7120758_861_7120758_1588958974489.png
http://10.10.50.70:6060//finalout1/himachal-pradesh-nle/thumbnail/08-May-2020/7120758_861_7120758_1588958974489.png

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నష్టపరిహారం కోట్లలో ఇస్తున్నా... ఎప్పుడు ఏమౌతుందో అని బెంగతో అక్కడ ఉన్నవారు జీవితాంతం బిక్కుబిక్కుమంటూ బ్రతకాలా..? అని అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రికి పరిశ్రమపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మండిపడ్డారు.

అయ్యన్నపాత్రుడి ట్వీట్

విశాఖలో విషవాయువు లీకైన ఘటన జరిగి రెండు రోజులైనా... ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చెయ్యడం లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. హైపవర్ కమిటీలో కేంద్రప్రభుత్వ సంస్థలకి సంబంధించిన ప్రతినిధులు, సైంటిస్టులు ఎందుకు లేరని నిలదీశారు. విచారణకు నెల రోజుల సమయం ఎందుకని ప్రశ్నించారు.

కంపెనీని బయటప్రాంతాలకు తరలించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాధితుల సంక్షేమం కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు ఏం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్సు బాధితులకు చేరడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వాన్ని నిలదీసిన దేవినేని ఉమ

ఇదీ చూడండికర్ణాటక సీఎంకు చంద్రబాబు కృతజ్ఞతలు

ABOUT THE AUTHOR

...view details