ముఖ్యమంత్రి జగన్పై తెలుగుదేశం బీసీ నేతలు విమర్శలు గుప్పించారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బంధువులైన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలకు సామంత రాజులుగా ఎంపికచేశారని ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డి రాజ్యంలో సామాజిక న్యాయం అనే మాటే లేదని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. సీఎం జగన్కు సామాజిక అన్యాయంలో మొదటి స్థానం ఇవ్వాలని తెదేపా అధికార ప్రతినిథి పంచుమర్తి అనురాధ విమర్శించారు.