కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కన్నబాబును కలిసి తెదేపా నేతలు విజ్ఞప్తి చేశారు.
గతంలో వైకాపా నేతలు బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని.. వాటిని రద్దు చేయాలని ఎస్ఈసీని కోరారు. పురపాలక ఎన్నికలను ఏడాదిపాటు నిలిపివేయడంతో చాలామంది ఆసక్తి కోల్పోయారని.. మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెదేపా నేతలు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఔత్సాహికులకు అవకాశం కల్పించాలని కోరినట్లు వారు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులు అదనంగా సమయం కేటాయించాలని కోరినట్టు పేర్కొన్నారు.